‘లోకేష్‌తో సహా మంత్రులంతా ఓడిపోతారు’ | YSRCP Leader C Ramachandraiah Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అలాంటి బుద్ధులు చంద్రబాబుకే ఉన్నాయి : రామచంద్రయ్య

Apr 13 2019 3:51 PM | Updated on Apr 13 2019 7:08 PM

YSRCP Leader C Ramachandraiah Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : లోకేష్‌తో సహా టీడీపీ మంత్రులంతా దారుణ పరాజయం పొందబోతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య పేర్కొన్నారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్‌ కమిషన్‌ను తప్పు పట్టడం బాబు ఇష్టం కానీ తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీద ఆరోపణలు చేయడం బాబుకు తగదన్నారు. ఓటింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు బాబు ప్రయత్నించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎలక్షన్‌ కమిషన్‌ మీద తనకు నమ్మకం లేదంటారు.. మళ్లీ ఆయనే ఈసీ దగ్గరకు వెళ్తారని ఎద్దేవా చేశారు.

ఇంటిలిజెన్స్‌ ఐజీ, కొందరు ఎస్పీలు, డీజీపీని గుప్పిట్లో పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థను నడిపిద్దామనుకున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. కానీ ఈసీ చంద్రబాబు ఆటలు సాగనివ్వలేదని పేర్కొన్నారు. చంద్రబాబు చర్యలకు సీఎస్‌ బలిపశువు అయ్యారన్నారు. ఈసీపై చంద్రబాబు వేలు చూపిస్తూ మాట్లాడటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. చంద్రబాబు చర్యలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు అవినీతిపరుడని అన్నా హజారేకు కూడా అర్థమయ్యింది.. అందుకే ఢిల్లీలో ఆయన దీక్షకు చంద్రబాబును రానివ్వలేదని పేర్కొన్నారు. ఈవీఎంల్లో చిప్స్‌ మార్చారు.. ట్యాంపరింగ్‌ చేశారు అని చంద్రబాబు నాయుడు అనడం హాస్యాస్పదమన్నారు. అలాంటి బుద్ధులు చంద్రబాబుకే ఉన్నాయని ఎద్దేవా చేశారు.

ఈ ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌ పరిణీతి చెందిన రాజకీయ నేతగా ఎదిగారిని పేర్కొన్నారు. చంద్రబాబు ఓటింగ్‌కు ఒక రోజు ముందు జనాల అకౌంట్లో డబ్బులేసినా జగన్‌ ఎవరికి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మరి కొద్ది రోజుల్లోనే రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి.. ప్రజాస్వామ్య విజయం రాబోతుందని రామచంద్రయ్య ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకూ చంద్రబాబును ఊహాలోకంలో బతకనివ్వండన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement