వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు

YSRCP Candlelight Rally Against Violence On Women In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలో వరుసగా మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా శనివారం 13 జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు. ఈ ర్యాలీలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజక వర్గంలో పాదయాత్ర ముగిసిన తర్వాత వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, బాధితులకు సంఘీభావం తెలుపుతూ కొవ్వొత్తి పట్టుకుని జననేత నడిచారు.

మహిళలు, చిన్నారులపై దాడులు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ నేతలే మహిళలపై దాడులకు దిగడం దారుణమని ఖండించారు. మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో క్యాండిల్‌ ర్యాలీ ఇలా.. 

 • వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గుంటూరులోని వినుగొండలో నేతలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు పాల్గొన్నారు. 
 • తూర్పుగోదావరి కొత్తపేటలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.
 • ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరులో క్యాండిల్‌ ర్యాలీ చేపట్టారు. 
 • వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. జిల్లాలోని రాజంపేట ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి క్యాండిల్‌ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
 • నెల్లూరులో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు గౌరి, శోభారాణిలో పాల్గొన్నారు. చీపురపల్లిలో మజ్జి శ్రీనివాసరావు ఆధ్యర్యంలో క్యాండిల్‌ ర్యాలీ ప్రారంభమైంది.
 • విజయనగరం జిల్లా కురుపాంలో ఎమ్మెల్యే పుష్పవాణి ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ చేపట్టారు. నెల్లిమర్లలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్‌ సీపీ నేతలు పెన్మత్స సాంబశివరాజు, అప్పలనాయుడు, కందుల రఘుబాబులు పాల్గొన్నారు.
 • కర్నూల్‌లో గౌరు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ ప్రారంభించారు. జిల్లాలో హొళగొందలో జనార్దన్‌ నాయుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభమైంది. 
 • ఎమ్మిగనూరులో ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ చేపట్టారు. 
 • పశ్చిమగోదావరి నరసాపురంలో ముదునురి ప్రసాద్‌రాజు ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ చేపట్టారు. జిల్లాలోని చింతలపూడిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఎలిజా, జానకిరెడ్డి, పాశం రామకృష్ణలు పాల్గొన్నారు. ఉండిలో పీవీఎల్‌ నరసింహజారు ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు.
 • విజయవాడ తూర్పు నియోజక వర్గంలో బొప్పన  భవకుమార్‌ ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ ప్రారంభమైంది.
 • ప్రకాశంజిల్లా కనిగిరిలో వైఎస్సార్‌సీపీ ఇంచార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆద్వర్యం లో కొవొత్తుల ర్యాలీ చేపట్టారు. గిద్దలూరులో వైఎస్సార్‌సీపీ నాయకురాలు పిడతల సాయి కల్పనరెడ్డి ఆధ్వర్యంలో గంధీ విగ్రహాం నుంచి వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
 • మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు అరికట్టడంలో చంద్రబాబు సర్కార్ వైఫల్యంపై అనంతపురం జిల్లా మడకశిరలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో క్యాండీల్‌ ర్యాలీ చేపట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top