టీటీడీ బోర్డులో టీడీపీ రాజకీయాలేంటీ? | YSR congress leader vellampalli srinivas fires on government over TTD issue | Sakshi
Sakshi News home page

టీటీడీ బోర్డులో టీడీపీ రాజకీయాలేంటీ?

May 18 2018 2:59 PM | Updated on Aug 18 2018 8:05 PM

YSR congress leader vellampalli srinivas fires on government over TTD issue - Sakshi

సాక్షి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తెలుగుదేశం పార్టీ రాజకీయలేంటి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో బ్రాహ్మణ సంఘాలపై దాడులు పెరిగాయన్నారు.

టీడీపీ దర్శకత్వంలో టీటీడీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిని తొలగించడం సరికాదన్నారు. రమణ దీక్షితులను ఎందుకు తొలగించారో ప్రజలకు సమాధానం చెప్పాలని వెల్లంపల్లి డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement