
ఓఎన్‌జీసీ గ్యాస్ ప్రమాద బాధితులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
సాక్షి, మామిడికుదురు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 197వ రోజు ఆదివారం పి. గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలంలో జననేత పాదయాత్ర చేశారు. రేపు (సోమవారం) ఇదే మండలంలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.
నగరం నుంచి రేపు ఉదయం 198వ రోజు పాదయాత్ర మొదలుపెడతారు. మామిడికుదురు, కికలపేట మీదురుగా అప్పనపల్లి క్రాస్ చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తర్వాత పాశర్లపూడి, పాశర్లపూడి బాడవ వరకు పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.
197వ రోజు పాదయాత్రలో భాగంగా నగరంలో ఓఎన్‌జీసీ గ్యాస్ ప్రమాద బాధితులతో వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రభుత్వం తమకు తగిన న్యాయం చేయలేదని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. న్యాయం చేస్తానని జననేత వారికి హామీయిచ్చారు. వైఎస్ జగన్ ఈరోజు 8.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,414.2 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు.