రేణిగుంట చేరుకున్న వైఎస్‌ జగన్‌

YS Jagan Mohan Reddy Samara Shankaravam In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి / హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బూత్‌ కమిటీల నిర్మాణంపై దృష్టి సారించిన వైఎస్‌ జగన్‌ తిరుపతి వేదికగా సమర శంఖం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు తిరుపతిలో తటస్థులతో సమావేశమైన అనంతరం పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో నిర్వహిస్తున్న ‘సమర శంఖారావం’ సభలో ఆయన పాల్లొంటారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో టీడీపీ సర్కారు సాగిస్తున్న అరాచక, అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పలికే విధంగా ఎన్నికల పోరాటానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు.

చరిత్ర కానున్న ‘సమర శంఖారావం’
దాదాపు 45 వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, బూత్‌ కమిటీ సభ్యులు పాల్గొననున్న ‘సమర శంఖారావం’ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనుంది. ఇంత భారీ ఎత్తున బూత్‌స్థాయి కార్యకర్తలతో నేరుగా సమావేశమవడం ఆంధ్రప్రదేశ్‌ చర్రితలో ఇదే తొలిసారి. తిరుపతిలో నేడు (బుధవారం) సమర శంఖారావం సభ అనంతరం పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు వైఎస్‌ జగన్‌ జిల్లాలవారీగా సమావేశాలను నిర్వహిస్తారు. రెండో రోజైన 7వ తేదీన వైఎస్సార్‌ జిల్లాలో సమర శంఖారావం సభలకు హాజరవుతారు. 11వ తేదీన అనంతపురం, 13వతేదీన ప్రకాశం జిల్లాల్లో జరిగే సమావేశాల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. సభా వేదిక, ఏర్పాట్లకు సంబంధించిన డ్రోన్ విజువల్స్, ఆకట్టుకుంటున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top