 
													
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
సాక్షి, అమరావతి: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి గడువు మంగళవారంతో ముగుస్తుండగా.. చివరి రోజున ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
మంగళవారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి, 11.30 గంటలకు కర్నూలు, మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగే ప్రచార సభల్లో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. తిరుపతిలో జరిగే ప్రచార సభతో జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 
నేడు డోన్, ఆళ్లగడ్డలో వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ప్రచారం చివరి రోజున కర్నూలు జిల్లాలోని డోన్, ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు.
విజయవాడ పశ్చిమ, మైలవరం, జగ్గయ్యపేటలో షర్మిల ప్రచారం
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మంగళవారం కృష్ణా జిల్లాలోని విజయవాడ(పశ్చిమ), మైలవరం, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు.  

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
