రాహుల్‌ ఓ బచ్చా.. మాకు 150 సీట్లు గ్యారెంటీ!

Yeddyurappa calls rahul gandhi baccha - Sakshi

సాక్షి, బెంగళూరు : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో రాజకీయం వేడెక్కుతోంది. రోజురోజుకు ప్రచార ఉధృతి పెరుగుతోంది. ఇటు అధికార కాంగ్రెస్‌ పార్టీ, అటు ప్రతిపక్ష బీజేపీ గెలుపు లక్ష్యంగా శాయశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రత్యర్థులపై పదునైన వాగ్బాణాలు, విమర్శలు సంధిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కర్ణాటకలో పర్యటించి..తమ తమ పార్టీల ప్రచారానికి ఊపునిచ్చారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కర్ణాటకలో సుదీర్ఘంగా పర్యటిస్తున్నారు.

ఎట్టిపరిస్థితుల్లో బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా షా మంత్రాంగం సాగుతోంది. ఉడిపిలో ఆయన బుధవారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘కర్ణాటక ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని ఉపయోగించుకొని.. సిద్దరామయ్య ప్రభుత్వాన్ని గద్దె దించాలి. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి’ అని ఆయన కమలం శ్రేణులకు ఉద్బోధించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప  రాహుల్‌ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్‌ ఓ బచ్చా అని అభివర్ణించారు. ‘ఆ బచ్చా (రాహుల్‌)ను కర్ణాటకలోకి తీసుకురావడంతో మా విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇప్పుడు 150కిపైగా సీట్లు గెలుస్తాం’ అని సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top