భూకుంభకోణాలపై సిట్‌ నివేదిక వెల్లడిస్తాం: అవంతి

We Will Reveal SIT Report Said By Minister Avanthi Srinivas Rao - Sakshi

విశాఖపట్నం: విశాఖ నగరాన్ని టూరిజం హబ్‌గా మారుస్తామని మంత్రి అవంతి శ్రీనివాస రావు చెప్పారు. బుధవారం పర్యాటక, రెవిన్యూ, జాతీయ రహదారులు, పోలీసు శాఖాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ.. టూరిజం ప్రాజెక్టుల కింద ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని పనులు ప్రారంభించని వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. జాతీయరహదారి కోసం భూములు సమర్పించిన  రైతులకు(390 ఎకరాలు ఇచ్చారు) ఆగస్టులో పరిహారం చెల్లిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు.

భూకుంభకోణాలపై సిట్‌ నివేదికను బహిర్గతపరుస్తామని అన్నారు. అవసరమైతే పునర్విచారణ జరిపిస్తామని చెప్పారు. లూలూ మాల్‌ కోసం భూమికి భూమి ఇవ్వడంలో ప్రభుత్వానికి నష్టం జరిగిందని, ప్రభుత్వానికి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోమని వ్యాఖ్యానించారు. బెల్ట్‌ షాపులన్నీ తర్వలోనే మూయిస్తామని మహిళలకు హామీ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top