‘ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’

We Invite The Decision Of Local Body Elections Postponed, GVL - Sakshi

కాకినాడ:  కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే.  కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదివారం నిర్ణయం తీసుకుంది. దీనిపై మాట్లాడిన జీవీఎల్‌.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం మంచి నిర్ణయమేనన్నారు. ( ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా)

కరోనాపై అప్రమత్తత అవసరమని పేర్కొన్న జీవీఎల్‌.. ఆ వైరస్‌ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలన్నింటినీ ఇప్పటికే చేపట్టిందన్నారు. విదేశాల నుంచి వచ్చే వేలాది మంది టూరిస్టులుకు, ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉండిపోయిన భారతీయులను కూడా కరోనా పరీక్షలు నిర్వహించి తీసుకువస్తున్నామన్నారు. బీజేపీ తరఫున కార్యకర్తలు కూడా కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ సంప్రదాయంలో భాగమైన నమస్కారం పెట్టి సంస్కృతి కొనసాగించాలన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top