బతుకమ్మను ‘కార్పొరేట్‌’గా మార్చారు.. | vimalakka on batukamma | Sakshi
Sakshi News home page

బతుకమ్మను ‘కార్పొరేట్‌’గా మార్చారు..

Published Fri, Sep 29 2017 2:04 AM | Last Updated on Fri, Sep 29 2017 2:04 AM

vimalakka on batukamma

హసన్‌పర్తి/వెంకటాపురం(కె): బతుకమ్మ ను కార్పొరేట్‌గా మార్చారని తెలంగాణ యునైటెడ్‌ ఫోరం (టఫ్‌) రాష్ట్ర అధ్యక్షు రాలు విమలక్క అన్నారు. వరంగల్‌  57వ డివిజన్‌ ముచ్చర్లలో శుక్రవారం జరిగిన బతుకమ్మ సంబరా ల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.

జయశంకర్‌ భూపాల పల్లి జిల్లా వెంకటాపురం (కె)లో  విలే కరులతో మాట్లాడారు. ఊరూవాడా ఏకమై సం తోషంగా బతుకమ్మలు ఆడాలే తప్ప... గిన్నిస్‌బుక్‌ కోసం బతుకమ్మలు ఆడడ మేమిటని ప్రశ్నించారు. అభివృద్ధి పేరు చెబుతూ వందల కోట్లలను టీఆర్‌ఎస్‌ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆదివాసీలకు అటానమస్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని  విమలక్క డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
Advertisement