దొంగ ఏడుపులు వద్దు.. పుట్ట త్వరలోనే పగులుతుంది! | Vijaya Sai Reddy Tweet About KIA Motors | Sakshi
Sakshi News home page

దొంగ ఏడుపులు వద్దు.. పుట్ట త్వరలోనే పగులుతుంది!

Jun 4 2019 12:19 PM | Updated on Jun 4 2019 12:19 PM

Vijaya Sai Reddy Tweet About KIA Motors - Sakshi

కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుందని..  యువ సీఎంకు ఏం చేయాలో తెలుసని

సాక్షి, హైదరాబాద్‌ : కియా కార్ల పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ​ సభ్యుడు విజయసాయి రెడ్డి హెచ్చరించారు. సోమవారం ట్విటర్‌ వేదికగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కియా కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుందని, అక్కడ అంతా తమిళులే, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని ఏడుపు లంకించుకున్నాయన్నారు. దొంగ ఏడుపులు వద్దని, యువ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఏం చేయాలో తెలుసని, కియా పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని హెచ్చరించారు. ఇక అంతకు ముందు ప్రభుత్వ కార్యాలయాల అద్దే విషయంలో జరిపిన అవినీతిని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement