టీడీపీ నేతలకు ఎందుకు ఉలిక్కిపాటు?

Vijaya Sai Reddy Fires On TDP Leaders And Yellow Media - Sakshi

అవి పేదలవి కావు.. వ్యవస్థల్ని మేనేజ్‌ చేసిన పెద్దోళ్లవి

ట్విటర్‌లో విజయసాయి రెడ్డి ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌ : నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. అవి ఇళ్లు లేని పేదలు కట్టుకున్నవి కాదని, వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి పెద్దోళ్లు నిర్మించుకున్నవని తెలిపారు. ఇన్నాళ్లు చట్టాల కళ్లుగప్పారని, ఇకపై సాధ్యం కాదని చురకలంటించారు. మంగళవారం ఆయన ట్విటర్‌ వేదికగా గత ప్రభుత్వపాలన, ఎల్లోమీడియాపై ధ్వజమెత్తారు.

విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్నయూ-టర్న్ వల్ల పనులు మొదలు కాకుండా పోయాయన్నారు. మొదట భూసేకరణ తామే చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చి తర్వాత చెరిసగం భరించాలని మెలిక పెట్టారని రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారని తెలిపారు. ‘అమ్మ ఒడి పథకం’ అన్ని పాఠశాలకు వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ చేసిన ప్రకటనతో ఎల్లో మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయిందని విమర్శించారు. ఈ పథకంపై రకరకాల వార్తలను వండి వార్చిందని, ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేస్తారనే విధంగా అనుమానాలు రేకిత్తించే ప్రయత్నం చేసిందని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

ఒకే మాట మీదున్నాం..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి 303 మంది సభ్యులున్నారని, ఎవరి మీద ఆధారపడే పరిస్థితి లేదన్నారు. అయినా హోదా కోసం పోరాడుతూనే ఉంటామని సీఎం జగన్‌ స్పష్టంగా చెప్పారని, అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడూ ఒకే మాట మీదున్నామని విజయసాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబులా హోదా సంజీవని కాదని ఎన్నడూ అనలేదు కదా? అని ప్రశ్నించారు.
చదవండి: ‘ప్రజావేదిక’పై సీఎం జగన్‌ సంచలన నిర్ణయం 
మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్‌ జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top