ట్రైల‌ర్‌కే బాబు హైద‌రాబాద్‌కు పోయారు

Vijay Sai Reddy Satirical Comments On Nara Lokesh - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. "చిట్టి మాలోకం చిన్న మెదడు పూర్తిగా చితికిపోయినట్లుంది. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది బాబు హయాంలోనే. తొమ్మిదేళ్ల వరస కరువును ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మేత దొరకక పశువులను కబేళాలకు అమ్ముకున్న దయనీయ దృశ్యాలను ప్రపంచమంతా చూసింది. రాజన్న రాకతోనే వ్యవసాయం పండగలా మారింది" అంటూ శుక్ర‌వారం ట్వీట్ చేశారు. (పెద్ద, చిట్టి నాయుళ్లు గుండెలు బాదుకోకండి)

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏడాది పాల‌న ట్రైల‌ర్‌కే.. క‌లుగులో దాక్కున్న ఎలుక‌లా బాబు హైద‌రాబాద్‌లో గ‌డుపుతున్నార‌ని విమ‌ర్శిస్తూ మ‌రో ట్వీట్ చేశారు. వ‌చ్చే నాలుగేళ్ల‌లో అస‌లు సినిమా చూసి ఏమ‌వుతారోన‌ని ఎద్దేవా చేశారు. అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయారన్నారు. ఈ దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందేన‌ని విజ‌య‌సాయిరెడ్డి హెచ్చ‌రించారు. (దొంగే దొంగా.. దొంగా అంటున్నాడు!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top