దటీజ్‌ వెంకయ్య.. రాజ్యసభలో కొత్త సవరణ

Venkaiah Naidu Tells MPs Not To Say I Beg To - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎక్కడ ఉన్నా తన మార్క్‌ చూపించడం ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్న వెంకయ్యనాయుడి ప్రత్యేకత. సందర్భం ఏదైనా ఆయన మాటలతోగానీ, చేతలతోగానీ ఇట్టే ఆకర్షిస్తారు లేదా ఆలోచింపజేస్తారు. శుక్రవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజ్యసభలో చైర్మన్‌గా కొలువుదీరిన వెంకయ్యనాయుడు సభలోకి రాగానే అభివాదం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇక నుంచి సభ్యులు నియంతృత్వానికి చిహ్నమైన 'నేను వేడుకుంటున్నాను' అనే మాటలను మర్చిపోవాలని, ఆ పదం స్థానంలో 'నేను లేవనెత్తుతున్నాను' అనే మాటను ఉపయోగించాలని చెప్పారు.

ఈ సవరణను ప్రతి ఒక్క చట్టసభ్యుడు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సాధారణంగా చట్టసభలో సభ్యులు తాము చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడానికి ముందు టేబుల్‌పై తమ చేతుల్లో ఉన్న పత్రాలను పెడుతూ 'ఐ బెగ్‌ యూ' (నేను వేడుకుంటున్నాను) అనే పదంతో చైర్మన్‌కు విజ్క్షప్తి చేస్తారు. అయితే, ఈ పదాన్ని స్వాతంత్ర్యానికి పూర్వం వాడేవారని, ఇప్పుడు మనది స్వాతంత్ర్య భారతదేశం అని ఇక నుంచి 'మీ విజ్ఞప్తి పత్రాలు అందించేముందు నేను లేవనెత్తుతున్నాను అనే పదం వాడండి బెగ్‌ అనేది వాడాల్సిన అవసరం లేదు.. ఇది స్వతంత్ర్య భారతదేశం' అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top