నేను అలా అనుకోవడం లేదు: ఉత్తమ్‌ | Uttam Kumar Reddy Comments On TPCC Leaders | Sakshi
Sakshi News home page

నేను అలా అనుకోవడం లేదు: ఉత్తమ్‌

Jun 20 2018 4:47 PM | Updated on Sep 19 2019 8:44 PM

Uttam Kumar Reddy Comments On TPCC Leaders - Sakshi

తనపై ఫిర్యాదు చేసేందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారని అనుకోవడం లేదని పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

సాక్షి, హైదరాబాద్‌: తనపై ఫిర్యాదు చేసేందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారని అనుకోవడం లేదని పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీకి బర్త్‌డే విషెస్ చెప్పడానికే నేతలు ఢిల్లీ వెళ్లారన్నారు. కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీ నుంచి చాలామంది నేతలు రెడీగా ఉన్నారన్నారు. స్థానిక నేతలతో మాట్లాడుతున్నామని త్వరలోనే చేరికలుంటాయని వెల్లడించారు. సర్పంచ్‌ రిజర్వేషన్లు అస్థవ్యస్థంగా ఉన్నాయని ఆరోపించారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

పంచాయతీరాజ్ చట్టానికి విరుద్దంగా రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. ఏ ప్రాతిపదికన, ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తామంటున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. సర్పంచ్ రిజర్వేషన్‌లపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నేతలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. దీనికి సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement