శ్రీకాంతాచారి తల్లికి టికెట్‌ ఇవ్వాలని.. | Two Members Climbs Cell Tower Demanding Gives MLA Ticket For Shankaramma | Sakshi
Sakshi News home page

Sep 7 2018 5:05 PM | Updated on Sep 7 2018 5:07 PM

Two Members Climbs Cell Tower Demanding Gives MLA Ticket For Shankaramma - Sakshi

సెల్‌ టవర్‌ ఎక్కిన యువకులు

ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్‌..

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఇద్దరు యువకులు రేడియో టవర్ ఎక్కారు. శుక్రవారం ఎల్బీనగర్లోని చింతల్ కుంటలోని రేడియో టవర్ ను ఎక్కిన యువకులు శంకరమ్మకు టికెట్ ఇస్తేనే కిందకు దిగుతామని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు గంటల నుంచి ఇద్దరు యువకులు రేడియో టవర్ పైనే ఉండటంతో అక్కడ స్థానికులు భారీగా గుమిగూడారు.

తెలంగాణ ఉద్యమంలో ఆమరణ దీక్షకు సిద్దమైన కేసీఆర్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ.. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరాస్తాలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  2014 ఎన్నికల్లో ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ అమరవీరులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement