ప్రధానిని కలిసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

TRS MPs Meet Narendra Modi Over Land Allocation To Party Office - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీలు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయింపుపై వారు ప్రధానంగా ప్రధానితో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో పార్టీ కార్యలయం నిర్మించడానికి భూమి కేటాయింపు అంశంపై మోదీతో చర్చించినట్టు తెలిపారు. ఉభయసభల్లో కలిపి 17మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉన్నారని.. చట్ట ప్రకారం తమకు 1000 చదరపు గజాల స్థలం వస్తుందన్నారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ గైడ్‌ లైన్స్‌ ప్రకారం 1000 చదరపు మీటర్ల స్థలం ఇవ్వాలని చెప్పారు.  డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని తమకు కేటాయించాలని ప్రధానిని కోరినట్టు వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top