
సాక్షి, హైదరాబాద్: నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి పతనం ఏనాడో ప్రారంభమైందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నల్లగొండలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా భూపాల్‌రెడ్డి ఉంటారని చెప్పారు. నల్లగొండ, అలంపూర్‌లకు ఉపఎన్నికలు వస్తాయనే భావిస్తున్నామన్నారు. నల్లగొండ లోక్‌సభ నుంచి సీఎం కేసీఆర్ పోటీచేసే అవకాశాలున్నాయని, సిట్టింగులు అందరికీ టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు.