‘మీకు ఇష్టం లేకపోతే వ్యవసాయం చేసుకుంటా’ | TRS Minister Thummala Nageswara Rao Fires On Chandrababu Naidu Over Sitarama Project Issue | Sakshi
Sakshi News home page

Nov 29 2018 7:24 PM | Updated on Nov 29 2018 7:30 PM

TRS Minister Thummala Nageswara Rao Fires On Chandrababu Naidu Over Sitarama Project Issue - Sakshi

పక్క రాష్ట్ర పార్టీలు ఇక్కడ ఎందుకు

సాక్షి, ఖమ్మం : రాష్ట్రంలో ఉండే పార్టీలే ఇక్కడ రాజకీయం చేయాలి.. పక్క రాష్ట్ర పార్టీలు తెలంగాణలో ఎందుకంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారమిక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తుమ్మల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కేంద్రానికి లేఖలు రాసింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాదా అంటూ ప్రశ్నించారు. టీడీపీని వీడేటప్పుడు చాలా బాధపడ్డానని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అన్నారు. ప్రజలకు ఇష్టం లేకపోతే వెళ్లి వ్యవసాయం చేసుకుంటానని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న పార్టీలే రాష్ట్రంలో రాజకీయం చేయాలి.. పక్క రాష్ట్ర పార్టీలు ఇక్కడ ఎందుకంటూ తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి జిల్లా ప్రజలు తనను గెలిపిస్తే సీతరామ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement