ఊర్మిళ ఓ ముస్లిం.. ఆమె పేరు మరియం  | Trolls Convert Urmila Matondkar To Islam | Sakshi
Sakshi News home page

ఊర్మిళ ఓ ముస్లిం.. ఆమె పేరు మరియం 

Mar 31 2019 12:27 PM | Updated on Mar 31 2019 3:56 PM

Trolls Convert Urmila Matondkar To Islam - Sakshi

ముంబై : కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముంబై నార్త్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న బాలీవుడ్‌ నటి ఊర్మిళ మతోంద్కర్‌ వ్యతిరేకంగా ఆకతాయిలు ట్రోలింగ్‌ చేశారు. వికీపీడియాలోని ఊర్మిళ ప్రొఫైల్‌ పేజీలో ఆమె పేరు, మతం, తల్లిదండ్రుల వివరాలు, కుటుంబ నేపథ్యాన్ని మార్చేసి తప్పుడు వివరాలను అప్‌లోడ్‌ చేశారు. దీనిపై ఊర్మిళ కుటుంబ సభ్యులు మండిపడగా, బీజేపీ సోషల్‌మీడియా విభాగం ఈ నీచమైన ప్రచారానికి దిగిందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఊర్మిళ ప్రస్తుత పేరు మరియమ్‌ అక్తర్‌ మిర్‌ అనీ, 2015లో ఆమె కశ్మీరీ వ్యాపారవేత్త మొహసీన్‌ అక్తర్‌ మిర్‌ను పెళ్లిచేసుకున్నారని ఆకతాయిలు వికీపీడియాలో పోస్ట్‌చేశారు. ట్రోలింగ్‌ చేసిన వారిపై  వికీపీడియా చర్యలు తీసుకోవాలని ఊర్మిళ తండ్రి శ్రీకాంత్‌ మటోంద్కర్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement