టీడీపీ, జనసేన మధ్య పొడుస్తున్న పొత్తు!

TG Venkatesh Gives Clarity On Janasena and TDP Alliance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను ఏమనవద్దు’ అని రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు తమ నేతలకు స్పష్టమైన ఆదేశాలివ్వగా.. తాజాగా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ ఏకంగా టీడీపీ-జనసేనలు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు–పవన్‌ల రహస్య స్నేహం మరోసారి బయటపడింది. బుధవారం టీజీ వెంకటేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ-జనసేనల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటని పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. మార్చి నెలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఉంటాయని, టీడీపీ-జనసేనలు కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. 

సీఎం చంద్రబాబును కలిసి వచ్చిన తరువాతే వెంకటేశ్‌ ఈ వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ-జనసేనల మధ్య పొత్తు పొడిచిందని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ అనేక ఉదంతాలు చోటుచేసుకున్నాయి. చంద్రబాబుపై కక్ష సాధించేందుకే టీఆర్‌ఎస్‌ నేతలు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతిస్తున్నారని పవన్‌ వ్యాఖ్యానించడం తెలిసిందే. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ ప్రజాయాత్రకు బ్రేక్‌ పడటం కూడా పొత్తులో భాగమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top