మరో ఇద్దరు టీడీపీ అభ్యర్థుల ప్రకటన | tdp release candidates list | Sakshi
Sakshi News home page

మరో ఇద్దరు టీడీపీ అభ్యర్థుల ప్రకటన

Nov 15 2018 4:29 AM | Updated on Nov 15 2018 4:29 AM

tdp release candidates list - Sakshi

సామ రంగారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ తాజాగా మరో ఇద్దరు అభ్యర్థులను అధికారికంగా వెల్లడించింది. ఇబ్రహీంపట్నం నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్‌ నుంచి గణేశ్‌గుప్తాలు టీడీపీ తరఫున పోటీచేస్తారని బుధవారం ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో టీడీపీ పోటీ చేయాలనుకుంటున్న 14 స్థానా ల్లో 11 చోట్ల అభ్యర్థులను ప్రకటించినట్టయింది. సామ ఎల్బీనగర్‌ స్థానాన్ని ఆశించగా, ఆయన్ను ఇబ్ర హీంపట్నం అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం.

ఇదేందబ్బా?
ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌ స్థానాలను అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించడంపై ఆయా స్థానాలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా మండిపడుతున్నా రు. ఇబ్రహీంపట్నం స్థానా న్ని ఆశించిన రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ బుధవారం మధ్యాహ్నమే తన అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. నేడో, రేపో తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అదే స్థానాన్ని ఆశించిన మరో నేత మల్‌రెడ్డి రంగారెడ్డి బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇక రాజేంద్రనగర్‌ స్థానాన్ని సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి ఆశించారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ సైతం ఆ స్థానంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సీటును అనూహ్యంగా టీడీపీకి కేటాయించడంతో వారిద్దరూ ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement