టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు? | TDP Rajya Sabha candidates finalized | Sakshi
Sakshi News home page

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు?

Mar 11 2018 1:12 AM | Updated on Aug 14 2018 11:26 AM

TDP Rajya Sabha candidates finalized - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. టీడీపీకి దక్కే రెండు స్థానాలను ఓసీ, బీసీలకు చెరొకటి ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓసీ వర్గం నుంచి సీఎం రమేష్, బీసీల నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు.

అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సచివాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై చర్చించారు. సామాజిక సమీకరణలు, పార్టీ ప్రాధాన్యతలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆదివారం దీనిపై తుది నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement