ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌పై అట్రాసిటీ కేసు

TDP MLA Prabhakar Chowdary Enthusiasm In Janmabhoomi Programme - Sakshi

సాక్షి, అనంతపురం : జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి అత్యుత్సాహన్ని ప్రదర్శించారు. సమస్యలపై నిలదీసిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ శ్రీదేవి, ఆమె భర్త విజయభాస్కర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతల ఏకపక్ష వైఖరిపై కార్పొరేటర్‌ శ్రీదేవి, ఆమె భర్త నిలదీశారు. దీంతో టీడీపీ నేతలు శ్రీదేవి, విజయభాస్కర్‌ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే, టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు శ్రీదేవి, విజయభాస్కర్‌రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడి, దూషించిన టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top