టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం..! | TDP MLA Meda Aid Attacks on RTC Bus Driver | Sakshi
Sakshi News home page

May 9 2018 5:18 PM | Updated on May 9 2018 7:55 PM

TDP MLA Meda Aid Attacks on RTC Bus Driver - Sakshi

సాక్షి, రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అనుచరుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రాజంపేటలో ఆర్టీసీ బస్సు ముందు తన వాహనాన్ని టీడీపీ ఎమ్మెల్యే మేడా అనుచరుడు మనోహర్‌రెడ్డి అడ్డంగా నిలిపేవాడు. దీంతో బస్సు డ్రైవర్‌ హారన్ కొట్టాడు. తన వాహనానికే హరన్‌ కొడతావా అంటూ మనోహర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ మల్లికార్జున్‌పై దాడికి దిగాడు. రక్తం వచ్చేలా డ్రైవర్‌ను కొట్టాడు. దీంతో బస్సు డ్రైవర్‌ ఆస్పత్రిలో చేరాడు. దాడి సమయంలో నిందితుడు 84శాతం అల్కాహల్‌ సేవించి ఉన్నాడని రాజంపేట అర్బన్‌ పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement