‘పసుపు– కుంకుమ’ పేరుతో టీడీపీ ప్రచారం | TDP Leaders Code Violation In Chittoor | Sakshi
Sakshi News home page

‘పసుపు– కుంకుమ’ పేరుతో టీడీపీ ప్రచారం

Apr 6 2019 11:44 AM | Updated on Apr 6 2019 11:44 AM

TDP Leaders Code Violation In Chittoor - Sakshi

డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమపై సైకిల్‌ గుర్తుతో టీడీపీ అందజేసిన లెటర్లు

గుడిపాల చిత్తూరు జిల్లా: ‘డ్వాక్రా మహిళలకు రూ. 20 వేల పసుపు కుంకుమ ద్వారా డబ్బులు ఇస్తున్నాను. మీరంతా నన్ను ఆదరించాలి.’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళల ఇళ్లకు పోస్టుల ద్వారా లెటర్లు పంపిస్తున్నారు. చిత్తూరు జిల్లా గుడిపాలలో 831 డ్వాక్రా గ్రూపులకు గాను 8,100 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ కుప్పలుతెప్పలుగా పోస్టుల ద్వారా కార్డులు అందుతున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

చీరలు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు
గుంటూరు జిల్లా బాపట్లలో చీరలు పంపిణీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను శుక్రవారం రాత్రి ప్రత్యేక ఫోర్స్‌ బృందం అదుపులోకి తీసుకుంది. బాపట్లలోని కన్యకా పరమేశ్వడ​రి కాంప్లెక్స్‌లోని ముకుందం ఫ్యాషన్స్‌లో కొంతమంది డ్వాక్రా మహిళలకు స్లిప్పులు ఇచ్చి చీరలు పంపిణీ చేస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజిటింగ్‌ కార్డు వెనక షాపు పేరును స్టాంపుతో ముద్ర వేసి షాపులకు పంపుతున్నారు. ఈ విధంగా పట్టణంలోని ముకుందం షాపుతో పాటు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఓ షాపు, స్టేట్‌ బ్యాంకు ఎదురు మరో షాపులో పోలీసులు దాడులు నిర్వహించారు. చీరలను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంలో మున్సిపాలిటీలోని ఒకరిద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రత్యేక ఫోర్స్‌ అధికారులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement