టీడీపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

TDP EX MLA BK Parthasarathi Controversial Comments On AP Advocates - Sakshi

సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదులపై అనంతపురం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మూడు రాజధానులు ఏర్పడితే న్యాయవాదులు అంతా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్నారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కర్నూలు హైకోర్టు, విజయవాడ, విశాఖ హైకోర్టు బెంబీల్లో న్యాయవాదులు పని చేయాలంటే ఒక్కొక్కరు మూడు వివాహాలు చేసుకోవాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు కాదు రాజధాని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కాగా, బీకే వ్యాఖ్యలపై న్యాయవాదులు మండిపడుతున్నారు. తమను అవమానించేలా బీజే వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయన వెంటనే తమకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణకు అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తోంది. టీడీపీ నాయకులు సైతం మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణకు మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్‌ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top