పవన్‌ దిష్టిబొమ్మ దహనానికి యత్నం | TDP Activists Tries To Burn Effigy Of Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ దిష్టిబొమ్మ దహనానికి యత్నం

Mar 14 2018 9:08 PM | Updated on Mar 22 2019 5:33 PM

TDP Activists Tries To Burn Effigy Of Pawan Kalyan - Sakshi

సాక్షి, విజయవాడ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ దిష్టిబొమ్మను ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద దగ్ధం చేసేందుకు బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ రాసిచ్చిన స్క్రిప్టును పవన్‌ కళ్యాణ్‌ చదివారని అన్నారు. తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి రాజ్యమేలుతోందని, టీడీపీ ఎమ్మెల్యేలు తెలుగు తల్లిని దోచుకుంటున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement