
యశవంతపుర: మంసాహారం లేనిదే ముద్ద దిగని మాజీ సీఎం సిద్దరామయ్య కు ప్రకృతి చికిత్సలో భాగంగా పత్యం తప్పేటట్లు లేదు. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల మంజునాథేశ్వర ప్రకృతి చికిత్సాలయంలో ఆయన మూడు రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు.
చికిత్సలో భాగంగా ఆయనకు ఇక్కడి డాక్టర్లు ఉద యం ఆరు గంటలకు యోగా, ప్రాణా యా మం అనంతరం రాగి గంజి, 11 గంటలకు పచ్చి కూరగాయలు, మధ్యాహ్నం తేలికపాటి భోజనం, రాత్రి భోజనంలో మొలకెత్తిన వితనాలు, సలాడ్, మజ్జిగను మాత్రమే ఇస్తున్నారు. ఉప్పు, పులుపు, కారం వంటివి పూర్తిగా నిషేధించారు. ఎన్నికల నేపథ్యంలో విశ్రాంతి లేకుండా ఉండటంతో ఆయనకు బీపీ, షుగర్ తగ్గక పోవడంతో ఆయన ఇక్కడి ప్రకృతి వైద్యం తీసుకుంటున్నారు.