breaking news
Natural Treatment
-
ప్రకృతిసిద్ధంగా శరీర సౌందర్యం
ఆర్గానిక్, నేచురల్, వీగన్, గోగ్రీన్ లాంటి హ్యాష్‌ట్యాగ్స్ ఈమధ్యకాలంలో సోషల్‌మీడియాలో తరచూ కనిపిస్తున్నాయి. ఈ డిజిటల్ ప్రపంచంలో ఇవి ప్రముఖమైన పదాలుగా మారాయి. కారణం అవి పాకశాస్త్రంలోనే కాదు. శరీరసౌందర్యాన్ని పెంపొందించుకోవడంలోనూ ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతకాలంలో ఆరోగ్యవంతంగా జీవించడం, స్థిరమైన జీవన విధానం అనేవి ప్రధానంగా అందర్నీ ప్రభావితం చేస్తున్నాయి. ఇవే శరీర సౌందర్యం విషయంలో కూడా కీలకంగా మారాయి. అందుకే ఎన్ని పరిణామాలు చోటుచేసుకున్నా వినియోగదారులు ఇందుకు ఉపయోగపడే వస్తువుల్ని వినియోగిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ అందరి మదిలో ఉత్పన్నమయ్యే ప్రశ్న ఒక్కటే – మనకు లభిస్తున్న సబ్బులు, సౌందర్య సాధనాలన్నీ స్వచ్ఛమైనవేనా? మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. చర్మం ద్వారా ఎన్నో పోషకాలు మన శరీరం లోపలికి వస్తాయి. అయితే ఎన్నో మంచి పోషకాలతోపాటు, చర్మానికి చెడుచేసే ఎన్నో హానికారక రసాయనాలు కూడా చర్మం ద్వారా లోపలికి వచ్చేస్తుంటాయి. అందుకే అవి వాడేముందు మనం ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో ఏ పదార్ధాలు కలిపారు, ఎలాంటివి ఉపయోగించారో తెలుసుకోవాలని చర్మ సంరక్షణ నిపుణులు సూచిస్తున్నారు. గతంలో మన ఇళ్లలో పసుపు, చందనం, పాలతో స్నానం చేయించేవారు. వాటిని మనం పాతపద్ధతులంటున్నాం. కానీ అవి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌గా మారాయి. సంపూర్ణ చర్మ సంరక్షణ కావాలంటే మనం ఉపయోగించే ఉత్పత్తుల్లో కొన్ని తప్పక ఉండాలి. అవి ఏంటంటే... చందనం: క్రమం తప్పకుండా చందనం ఉపయోగించడం వల్ల చర్మానికి చాలా ఉపయోగాలు. ముఖ్యంగా చందనం బ్యాక్టీరియాను రాకుండా చేస్తుంది. చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది. ట్యాన్‌ని అరికడుతుంది. అన్నిటికీ మించి మీ చర్మం పొడిబారకుండా చేస్తుంది. దీనివల్ల మీ చర్మంపై ఎలాంటి ముడతలు కన్పించవు. పసుపు: చర్మంపై ఉండే మచ్చలను తొలగించి ముఖం ప్రకాశవంతంగా కన్పించేలా చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా చేస్తుంది. అన్నిటికీ మించి మొటిమల నివారణకు పసుపుని మించిన ఔషధం లేదు. పసుపు క్రమం తప్పకుండా వాడితే మొటిమలు రావు. కుంకుమ పువ్వు: కుంకుమ పువ్వులో అద్వితీయమైన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా స్వచ్ఛంగా, స్మూత్‌గా తయారవుతుంది. కలబంద: కలబందను అలోవెరా అని కూడా అంటారు. ఇది చర్మంపై ఒక పొరలాగా ఉపయోగపడుతుంది. ఈ లేయర్వల్ల చర్మంపై ఎప్పుడూ తేమ ఉంటుంది. అంతేకాదు ఇందులో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్, ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. బాదం పాలు: ఎండ వేడి వల్ల చర్మం పాడవకుండా కాపాడుతుంది. ఈ సహజసిద్ధమైన పదార్ధాలతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడంతోపాటు చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుకోవచ్చు. -
రాగి గంజి, పచ్చి కూరగాయలు..
యశవంతపుర: మంసాహారం లేనిదే ముద్ద దిగని మాజీ సీఎం సిద్దరామయ్య కు ప్రకృతి చికిత్సలో భాగంగా పత్యం తప్పేటట్లు లేదు. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల మంజునాథేశ్వర ప్రకృతి చికిత్సాలయంలో ఆయన మూడు రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. చికిత్సలో భాగంగా ఆయనకు ఇక్కడి డాక్టర్లు ఉద యం ఆరు గంటలకు యోగా, ప్రాణా యా మం అనంతరం రాగి గంజి, 11 గంటలకు పచ్చి కూరగాయలు, మధ్యాహ్నం తేలికపాటి భోజనం, రాత్రి భోజనంలో మొలకెత్తిన వితనాలు, సలాడ్, మజ్జిగను మాత్రమే ఇస్తున్నారు. ఉప్పు, పులుపు, కారం వంటివి పూర్తిగా నిషేధించారు. ఎన్నికల నేపథ్యంలో విశ్రాంతి లేకుండా ఉండటంతో ఆయనకు బీపీ, షుగర్ తగ్గక పోవడంతో ఆయన ఇక్కడి ప్రకృతి వైద్యం తీసుకుంటున్నారు. -
సాగే చర్మానికి సొల్యూషన్..
బ్యూటిప్స్ స్ట్రాబెర్రీ: ఈ పండ్లలో చర్మాన్ని బిగుతుగా చేసే గుణం ఉంటుంది. ఇది 100శాతం నేచురల్ ట్రీట్మెంట్. 5-6 స్ట్రాబెర్రీలను తీసుకొని గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో కొద్దిగా శనగపిండి వేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముడతలు తగ్గుతాయి. గుడ్డు తెల్లసొన, పెరుగు: ముడతలు మటుమాయం చేయడానికి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్ఫూన్ పెరుగులో రెండు గుడ్ల తెల్ల సొనను వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న మడతల వద్ద, మెడకు అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేకసుకోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతూ ముడతలు తగ్గుతాయి. బియ్యం పిండి: చర్మంపై ముడతలను తొలగించేందుకు రెండు టేబుల్ స్ఫూన్ల బియ్యం పిండిలో రెండు టేబుల్ స్ఫూన్ల రోజ్ వాటర్ లేదా గ్రీన్ టీను పోసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20-30 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.