
సాగే చర్మానికి సొల్యూషన్..
ఈ పండ్లలో చర్మాన్ని బిగుతుగా చేసే గుణం ఉంటుంది.
బ్యూటిప్స్
స్ట్రాబెర్రీ: ఈ పండ్లలో చర్మాన్ని బిగుతుగా చేసే గుణం ఉంటుంది. ఇది 100శాతం నేచురల్ ట్రీట్‌మెంట్. 5-6 స్ట్రాబెర్రీలను తీసుకొని గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో కొద్దిగా శనగపిండి వేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముడతలు తగ్గుతాయి.
గుడ్డు తెల్లసొన, పెరుగు: ముడతలు మటుమాయం చేయడానికి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్ఫూన్ పెరుగులో రెండు గుడ్ల తెల్ల సొనను వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న మడతల వద్ద, మెడకు అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేకసుకోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతూ ముడతలు తగ్గుతాయి.
బియ్యం పిండి: చర్మంపై ముడతలను తొలగించేందుకు రెండు టేబుల్ స్ఫూన్ల బియ్యం పిండిలో రెండు టేబుల్ స్ఫూన్ల రోజ్ వాటర్ లేదా గ్రీన్ టీను పోసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20-30 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.