‘హోదాకు మద్దతిస్తాం.. కానీ..’ | Shiromani Akali Dal MP Prem Singh Chandumajra Comments On No Confidence On BJP | Sakshi
Sakshi News home page

‘ హోదాకు మద్దతిస్తాం.. కానీ..’

Mar 19 2018 12:48 PM | Updated on Mar 19 2018 2:39 PM

Shiromani Akali Dal MP Prem Singh Chandumajra Comments On No Confidence On BJP - Sakshi

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పూర్తి మద్దతు ఇస్తామని శిరోమణి అకాలీదళ్‌ తెలిపింది. అయితే బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉండదని ఆ పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు ప్రేమ్‌సింగ్‌ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్‌డీఏ సర్కార్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభ ముందుకు రాకముందే సభ మంగళవారానికి వాయిదా పడింది.

విపక్ష సభ్యులు నిరసనలు తెలుపుతూ.. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి నిరసనలు వ్యక్తం చేశారు. గందరగోళ పరిస్థితుల్లో సభ నడపడం సాధ్యం కాదంటూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను వాయిదా వేశారు. హోదా కోసం అలుపెరుగని పోరు చేపట్టిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాత్రం ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళతామని పోరు కొనసాగిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు చేపట్టేలా పట్టుపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement