మాజీ ఎంపీ జేసీకి మరో ఎదురుదెబ్బ | Set back To JC Diwakar Reddy | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ జేసీకి మరో ఎదురుదెబ్బ

Nov 5 2019 4:54 PM | Updated on Nov 5 2019 5:07 PM

Set back To JC Diwakar Reddy - Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రవాణా శాఖ అధికారులు మంగళవారం జరిపిన తనిఖీల్లో ఐదు జేసీ ట్రావెల్స్ బస్సులు పట్టుబడ్డాయి. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లు లేకపోవడంతో అధికారులు ఈ బస్సులను సీజ్ చేశారు. అనంతపురం డీటీసీ శివరాంప్రసాద్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. తాజా దాడులతో ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లలో అక్రమాలు కారణంగా మొత్తం 36 బస్సులు.. 18 కాంట్రాక్టు బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన జేసీ బ్రదర్స్ సరైన పర్మిట్లు లేకుండా బస్సులు నడపటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement