‘కొత్త జిల్లాలకు కేంద్రం ఆమోదమేది?’

Revanth reddy open letter to cm kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఏర్పాటు చేసిన 21 కొత్త జిల్లాలకు ఏడాది గడిచినా కేంద్రం ఇంకా ఆమోదముద్ర వేయకపోవడాన్ని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఏ ప్రామాణికతను ప్రాతిపదికగా తీసుకోకుండా తోచిన పద్ధతిలో జిల్లాలు ఏర్పాటు చేయడం వల్లే కేంద్రం అధికారికంగా గుర్తించలేదని పేర్కొంటూ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాజకీయంగా ఉపయోగపడే నియోజకవర్గాల పునర్విభజన గురించి ప్రధానితో మాట్లాడారే తప్ప జిల్లాల సమస్య గురించి మాట్లాడలేదని, దీంతో జిల్లాలు, నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

జిల్లాలకు ప్రత్యేకంగా వచ్చే నిధులు కూడా ఆగిపోయే ప్రమాదముందని వెల్లడించారు. కొత్త జిల్లాల పేరుతో పాన్‌కార్డుకు దరఖాస్తు చేస్తే తిరస్కరిస్తున్నారని.. దీన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని రేవంత్‌ లేఖలో కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top