నిజాయితీపరులకే ఓటేయండి: నేగీ

Red carpet rolled out for 103-year-old Shyam Saran Negi at Himachal pradesh - Sakshi

స్వతంత్ర భారత తొలి ఓటర్‌ శ్యామ్‌శరణ్‌ నేగీ(102) ఆదివారం ఓటేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ నియోజకవర్గానికి చెందిన నేగీ పంచాయతీ నుంచి లోక్‌సభ వరకూ ప్రతీఎన్నికల్లో ఓటు వేశారు. భారత్‌లో తొలిఓటర్‌ కావడంపై నేగీ స్పందిస్తూ..‘1952, ఫిబ్రవరిలో మనదేశంలో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే వాతావరణం అనుకూలించదేమోనన్న కారణంతో కిన్నౌర్‌లో 1951, అక్టోబర్‌లోనే ఎన్నికల్ని నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటూనే నేను ఓటేశా’ అని తెలిపారు. రాజకీయ పార్టీలకు కాకుండా నిజాయితీపరులైన, చురుకైన అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు నేగీ విజ్ఞప్తి చేశారు. కాగా, నేగీని పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చి, తీసుకెళ్లేందుకు ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top