ఓటమి భయంతోనే అసెంబ్లీ రద్దు: రాంమాధవ్‌ | Ram madhav comments over kcr | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే అసెంబ్లీ రద్దు: రాంమాధవ్‌

Oct 14 2018 2:25 AM | Updated on Oct 14 2018 2:25 AM

Ram madhav comments over kcr - Sakshi

హైదరాబాద్‌: పార్లమెం ట్‌తోపాటే శాసన సభకు ఎన్నికలు జరిగితే ప్రధాని మోదీ ధాటిని తట్టుకోలేక ఓటమిపాలవుతామన్న భయంతోనే ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీని రద్దుచేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ అన్నారు. దేశవ్యాప్తంగా మోదీ, బీజేపీ హవా నడుస్తోందని, రెండు ఎన్నికలు ఒకేమారు జరిగితే టీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడం ఖాయమన్న సర్వే నివేదికలకు భయపడే శాసన సభను కేసీఆర్‌ రద్దు చేశారన్నారు.

సికింద్రాబాద్‌లో శనివారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమ్మేళనానికి రాం మాధవ్‌ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రజా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కాంగ్రెస్‌కు ప్రజాదరణ లేదని చెప్పారు. కాంగ్రెస్‌ అందుకోసమే టీడీపీ సహా ఇతర పార్టీలతో అపవిత్ర కూటమిగా జట్టుకట్టిందన్నారు. నగర బీజేపీ ఉపాధ్యక్షుడు బండపల్లి సతీశ్‌ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement