కేసీఆర్‌ దీక్ష వల్లే డిసెంబర్‌ 9 చారిత్రకం

prasanth reddy about telangana and kcr - Sakshi

మిషన్‌ భగీరథ ప్రాజెక్టు వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దీక్ష వల్లనే కాంగ్రెస్‌ పార్టీ దిగొచ్చి తెలంగాణ ప్రకటించిందని, కేసీఆర్‌ దీక్షతోనే డిసెంబర్‌ 9 చారిత్రక దినమైందని మిషన్‌ భగీరథ ప్రాజెక్టు వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.  ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలపై ప్రేమతో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వలేదని, కేసీఆర్‌ నాయకత్వంలో జరిగిన ఉద్యమ గరిమను చూసి ప్రకటించిందన్నారు. డిసెంబరు 23న తెలంగాణ ప్రకటనపై వెనక్కి తగ్గిన రోజును తెలంగాణ విద్రోహ దినంగా కాంగ్రెస్‌ అంటున్నదా అని ప్రశ్నించారు.    

మూడున్నరేళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా 60 కొత్త అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన దగానా అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రమంతా 24 గంటలపాటు వ్యవసాయానికి కరెంటు ఇస్తున్నారని చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 3 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించామని వివరించారు. ఇవన్నీ చేస్తే సీఎం కేసీఆర్‌ దగా చేసినట్టుగా జైపాల్‌ రెడ్డికి కనిపించిందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుటుంబంపై సంస్కార హీనంగా మాట్లాడితే అందరి బాగోతాలను బయటపెడతామని ఎంపీ బాల్క సుమన్‌ హెచ్చరించారు. రాజకీయాల్లో ప్రజలకు సంబంధించిన అంశాలపై మాట్లాడకుండా వ్యక్తిగత విషయాల గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడితే తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top