
విశాఖ సిటీ: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసిందని, కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కూడా అదే పంథా అవలంబిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 45 రోజుల పాటు ఉత్తరాంధ్రలో పోరాట యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.