టీడీపీ గూండాల దాడి...చోద్యం చూసిన పోలీసులు..!

Paritala Sunitha Supporters Attacks On YSRCP Leader Thopudurthi Prakash Reddy Convoy - Sakshi

అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి మంత్రి పరిటాల సునీత జీర్ణించుకోలేక పోతున్నారు. రౌడీయిజంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆమె సొంత మండలమైన రామగిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తోపుతుర్తి ప్రకాష్‌రెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించగా..అక్కడి ప్రజలు భారీ ఎత్తున మద్దతు పలికారు. దీంతో ఆమె వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. ముత్యాలంపల్లి వద్ద ప్రకాష్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేసి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఇంత జరగుతున్నా అక్కడున్న పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప టీడీపీ గూండాలను అడ్డుకునే యత్నం చేయలేదు. ఈ క్రమంలో డీఎస్పీ వెంకటరమణకి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

రాప్తాడులో సునీత దౌర్జన్యాలపై ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని, గత 25 ఏళ్లుగా పదవుల్లో ఉన్నా రామగిరి ప్రజల సమస్యలను పరిటాల కుటుంబం తీర్చలేకపోయిందని అన్నారు. ఐదేళ్లుగా రామగిరి మండలంలో పర్యటించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, ఇదంతా మంత్రి కుట్రేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. రామగిరి, కొత్తపల్లి, నసనకోట, పేరూరు గ్రామాల్లో ప్రకాష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top