ప్రియాంక ఎంట్రీతో మాకు ఎలాంటి నష్టం లేదు..! | Sakshi
Sakshi News home page

ప్రియాంక ఎంట్రీతో మాకెలాంటి నష్టం లేదు..!

Published Sat, Mar 16 2019 3:50 PM

No Difference With Priyanka Gandhi Enter Into Politics Says Yogi - Sakshi

లక్నో: కాంగ్రెస్‌ తురుపుముక్క ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లోకి రావడం వల్ల బీజేపీకి ఎలాంటి నష్టంలేదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ అభిప్రాయపడ్డారు. గతంలో కూడా ఆమె పార్టీ ప్రచారంలో పాల్గొన్నారని, ఈ ఎన్నికల్లో కూడా ఆమె ప్రభావం ఏమీ ఉండదని అన్నారు. కీలకమైన లోక్‌సభ ఎన్నికల ముందు ఉత్తర యూపీ ఇన్‌ఛార్జ్‌గా కాంగ్రెస్‌ అధిష్టానం ప్రియాంక గాంధీని నియమించిన విషయం తెలిసిందే. ఆమెతో ప్రచారం చేయించడం ద్వారా పూర్వవైభవం పొందాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈనెల 18 నుంచి 20 వరకూ ప్రియాంక వారణాసిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
తొలి ప్రసంగం: ఆమె ఎక్కడా తడబడలేదు!

18న ప్రయాగరాజ్‌ చేరుకునే ప్రియాంక అక్కడి నుంచి పడవలో వారణాసి వరకూ ప్రయాణిస్తారు. యూపీలో డీలాపడిన కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తెచ్చేందుకు ప్రియాంక చెమటోడుస్తున్నారు. ప్రియాంక రాక ఆ పార్టీలో ఓ భాగమేనని, జాతీయ రాజకీయాలపై ఆమె ఏమాత్రం ప్రభావం చూపలేదని యూపీ సీఎం అభిప్రాయపడ్డారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిపై కూడా ఆయన మండిపడ్డారు. అధికారం కోసమే ఇద్దరూ కలిసి పోటీచేస్తున్నారని విమర్శించారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి తమ పార్టీ ఓటు బ్యాంక్కు ఎలాంటి నష్టం చేకూర్చలేదని స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement