కాంగ్రెస్‌లో చేరిన నాగం జనార్థన్‌ రెడ్డి | Nagam Janardhan Reddy Joins Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన నాగం జనార్థన్‌ రెడ్డి

Apr 25 2018 11:55 AM | Updated on Sep 19 2019 8:44 PM

Nagam Janardhan Reddy Joins Congress Party - Sakshi

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగంతో పాటు వేములవాడ బీజేపీ నేత ఆది శ్రీనివాస్‌, ప్రజాగాయకుడు గద్దర్‌ కుమారుడు జి.వి. సూర్యకిరణ్‌  కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  

కాంగ్రెస్‌లోకి సూర్యకిరణ్, నాగం జనార్దన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌ల చేరికల కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియాతో పాటు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement