ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్‌.. కేసీఆర్‌కు ఒవైసీ థాంక్స్‌

Mumtaz Ahmad Khan Will Be Made Pro-tem Speaker OF Telangana Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చార్మినార్‌ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్‌ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. తెలంగాణ అసెంబ్లీలో ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అంతేకాకుండా కొత్త స్పీకర్‌ ఎన్నికయ్యేవరకు ప్రొటెం స్పీకర్‌ సభను నిర్వహిస్తారు.

సాధారణంగా సీనియర్‌ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ను సీఎం కేసీఆర్‌ ప్రొటెం స్పీకర్‌గా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అసదుద్దీన్‌ ఒవైసీ ట్విటర్‌లో ధ్రువీకరించారు. ఎంఐఎం సీనియర్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారని, ఇందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞుడినై ఉంటానని ఆయన ట్విట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top