మంజునాథ మాత్రమే జాప్యం చేశారు

Minister Narayana on Manjunatha Committee  - Sakshi

సాక్షి, అమరావతి : కాపు రిజర్వేషన్ల తీర్మానం నేపథ్యంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వటంలో జస్టిస్‌ మంజునాథ జాప్యం చేస్తున్నారని మంత్రి చెప్పారు. 

నలుగురు సభ్యుల్లో ముగ్గురు మాత్రమే ఇప్పటి వరకు నివేదిక ఇచ్చారని.. దీంతో మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో ముందుకు వెళ్లామని మంత్రి తెలిపారు. 50 శాతం రిజర్వేషన్లు దాటితే 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. అందుకే తీర్మానం చేసి కేంద్రానికి పంపాం అని మంత్రి వివరించారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రావనే తాము అనుకుంటున్నామని.. బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని మంత్రి నారాయణ తెలిపారు.  

కాగా, కాపు కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ మంజునాథ రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కమిషన్‌ సభ్యులుగా శ్రీమంతుల సత్యనారాయణ, మల్లెల పూర్ణచంద్రరావు, సుబ్రమణ్యం ఉన్నారు. కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్‌ కల్పించాలన్న ప్రతిపాదనను ఈ ముగ్గురు సభ్యులు సమర్థించారు.  చైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ మంజునాథ మాత్రం తన సిఫారసులు ఇవ్వలేదు. కమిషన్‌ సమష్టిగా ఏకాభిప్రాయంతో నివేదిక ఇస్తే బాగుంటుందని సీఎం చెబితే మంజునాథ వ్యతిరేకించినట్లు  తెలుస్తోంది.

కాపు రిజర్వేషన్లు.. బాబు వ్యూహం!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top