ఎంఐఎంకు దీటైన పోటీ.. అక్బర్‌పై పహిల్వాన్‌ సై..!

MBT To join alliance with Congress in Old City - Sakshi

ఓల్డ్‌సిటీలో కోసం ఎంబీటీ చేతులు కలుపనున్న కాంగ్రెస్‌

సాక్షి, హైదరాబాద్‌ : పాతబస్తీలో మంచి పట్టున్న మజ్లిస్‌ పార్టీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఎంఐఎంను ఎదుర్కొనేందుకు ఎంబీటీ (మజ్లిస్‌ బచావో తెహ్రీక్‌) పార్టీని కాంగ్రెస్‌ రంగంలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చి.. ఓల్డ్‌ సిటీలో సత్తా చాటేందుకు కాంగ్రెస్‌ పార్టీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. పాతబస్తీలోని ఏడు సీట్ల విషయమై భక్తచరణ్‌ దాస్‌ కమిటీతో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఈ స్థానాల్లో ఎంఐఎంకు పోటీగా కాంగ్రెస్‌, ఎంబీటీ ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇరుపార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.

పొత్తులో చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్‌ ఒవైసీపై మహమ్మద్‌ పహిల్వాన్‌ లేదా ఆయన కుటుంబసభ్యులను బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మద్‌ పహిల్వాన్‌ కొడుకు గురువారమే భక్తచరణ్‌ దాస్‌ కమిటీని కలిసినట్టు తెలుస్తోంది. ఈ పొత్తులో భాగంగా ఓల్డ్‌సిటీ భారాన్ని ఎంబీటీ పార్టీకే వదిలేయాని కాంగ్రెస్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఫక్రుద్దీన్‌కు షాక్‌
కాంగ్రెస్‌ మైనారిటీ నేత ఫక్రుద్దీన్‌కు పార్టీ అధిష్టానం షాక్‌ ఇచ్చింది. టీపీసీసీ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడిగా ఫక్రుద్దీన్‌ను తొలగించి.. ఆయన స్థానంలో షేక్‌ అబ్దుల్లా సోహైల్‌ను అధిష్టానం నియమించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top