లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలి | lambadies should remove from st list | Sakshi
Sakshi News home page

లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలి

Dec 26 2017 1:42 AM | Updated on Dec 26 2017 1:42 AM

lambadies should remove from st list - Sakshi

హైదరాబాద్‌: చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం హైదరాబాద్‌ హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఉద్యమాన్ని ఆదివాసీలు తీవ్రతరం చేశారని తెలిపారు.

ఈ నేపథ్యంలో అనేక సంఘర్షణలు నెలకొన్నాయన్నారు. గత 40 సంవత్సరాలుగా రాష్ట్రంలో లంబాడీలు ఎస్టీలుగా చలామణి అవుతూ ఆదివాసీల రిజర్వేషన్లు కొల్లగొడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లంబాడీలు కేవలం జీవో నం. 149 ద్వారా మాత్రమే ఎస్టీలుగా కొనసాగుతున్నారన్నారు. వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం సుధాకర్, కబ్బాకుల రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement