నేను మీ పప్పులా కాదు: కేటీఆర్‌

KTR Says Uttam Kumar Reddy to Unlike you I Did Not Loot Peoples Money And Burn It In My Car - Sakshi

ఉత్తమ్‌, కుంతియా వ్యాఖ్యలపై కేటీఆర్‌ ట్వీట్‌

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికలతో తెలంగాణలో రాజకీయం వేడేక్కింది. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కౌంటర్స్‌ ఇవ్వడం మొదలైంది. టీపీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ’నేను అమెరికాలో ఉన్నప్పుడు నా పనులు సొంతంగా చేసుకున్నాను. మీ పప్పులా కాకుండా  సొంతంగా సంపాదించుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నీలాగా ప్రజల సొమ్ముదోచుకుని కారులో తగలబెట్టలేదు.’ అని ఉత్తమ్‌కు కేటీఆర్‌ చురకలింటించారు. 2014 ఎన్నికల్లో భాగంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి సంబంధించిన కారులో రూ.2 కోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. అమెరికాలో కేటీఆర్‌ అంట్లూ తోమాడని ఉత్తమ్‌, రేవంత్‌ రెడ్డిలు ఎద్దేవా చేస్తూ కేటీఆర్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో వారి అధినేత రాహుల్‌ గాంధీని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. అలాగే ఆపిల్‌ కంపెనీ వ్యవహారంలో ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్‌ కుంతియా చేసిన వ్యాఖ్యలను మరో ట్వీట్‌లో కేటీఆర్‌ తిప్పికొట్టారు.‘ ఏఐసీసీ జెంటిల్‌మెన్‌.. స్కాంగ్రెస్‌ జోకర్‌ ఆజ్ఞానంతో మాట్లాడుతున్నారు. 2016లోనే ఆపిల్‌ కంపెనీ హైదరాబాద్‌లో తన వ్యవహారాలను ప్రారంభించింది. ప్రస్తుతం 3500 మందికి పైగా ఉద్యోగులతో అమెరికా తర్వాత అతిపెద్ద సెంటర్‌గా నిలిచింది’  అని ట్వీట్‌ పేర్కొన్నారు.

చదవండి: మరిన్ని ముందస్తు ముచ్చట్లు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top