అసత్య ఆరోపణలతో అడ్డంగా దొరికిన టీడీపీ నేత  | Kottu Satyanarayana Fires On TDP leader | Sakshi
Sakshi News home page

అసత్య ఆరోపణలతో అడ్డంగా దొరికిన టీడీపీ నేత 

May 16 2020 4:37 AM | Updated on May 16 2020 8:42 AM

Kottu Satyanarayana Fires On TDP leader  - Sakshi

ఎమ్మెల్యే సత్యనారాయణ , టీడీపీ అధికారప్రతినిధి పట్టాభి

తాడేపల్లిగూడెం: ఎటువంటి ఆధారాల్లేకుండా టీవీ చర్చలో మాట్లాడిన టీడీపీ నేత వైఎస్సార్‌సీపీ తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు అడ్డంగా దొరికిపోయారు. ఒక టీవీ చానల్‌ చర్చలో ఎమ్మెల్యే ఇసుక స్టాక్‌ పాయింట్లో అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. ఈ విషయంపై శుక్రవారం ఎమ్మెల్యే టీడీపీ నేత పట్టాభితో నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. ఏ ఆధారాలతో మాట్లాడారని నిలదీశారు.

ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్‌ విసిరారు. పార్టీ వాళ్లు చెబితే మాట్లాడానని, ఓ పత్రికలో వచ్చిన వార్తలు చూసి మాట్లాడా అని పట్టాభి అన్నారు. దీనిపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షం అన్నాక ఆరోపణలు చేస్తుందని, తమ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పట్టాభి తప్పించుకొనే ప్రయత్నం చేశారు. దమ్ము ధైర్యం ఉంటే  ఆరోపణలు రుజువు చేయాలని ఎమ్మెల్యే కొట్టు సవాల్‌ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement