
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నో రోజులుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు..ఇప్పుడే గుర్తొచ్చిందా ఈడీ అధికారులకు రేవంత్ కుటుంబం వ్యాపారం చేస్తుందని ప్రశ్నించారు.
నల్గొండ: నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్యకు, మునుగోడులో తనకు టికెట్ రాదని దుప్ర్పచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ.. చిరుమర్తి లింగయ్యకు, తనకు కచ్చితంగా టిక్కెట్ వస్తుందని, మమ్మల్ని గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. రేవంత్ రెడ్డిపై , జగ్గారెడ్డిలపై అధికారం ఉంది కదా అని కేసులు పెట్టడం, దాడులు చేయడం కరెక్ట్ కాదన్నారు. తాము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నో రోజులుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు..ఇప్పుడే గుర్తొచ్చిందా ఈడీ అధికారులకు రేవంత్ కుటుంబం వ్యాపారం చేస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్‌రావులపైన కూడ నకిలీ పాస్‌పోర్టు కేసు ఉంది.. జాగ్రత్త.. పాత కేసులు తిరగదోడి కేసులు పెట్టాలంటే ఒక్క నిమిషం పట్టదని టీఆర్‌ఎస్ నాయకులను హెచ్చరించారు.