లింగయ్యది నమ్మకద్రోహమే! | Komatireddy Raj Gopal Reddy comments on Lingaiah | Sakshi
Sakshi News home page

లింగయ్యది నమ్మకద్రోహమే!

Mar 9 2019 3:37 AM | Updated on Mar 9 2019 3:37 AM

Komatireddy Raj Gopal Reddy comments on Lingaiah - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ: నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరడం ఖాయమైంది. కేసీఆర్‌ సమక్షంలో అధికారికంగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారని సమాచారం. లింగయ్య ఇప్పటికీ బహిరంగంగా తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించలేదు. తాజా పరిణామాలతో నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులతోపాటు కోమటిరెడ్డి సోదరులు షాక్‌కు గురయ్యారు. ‘లింగయ్య పార్టీ మారే విషయం నాకు తెలి యదు. ఆయన నన్ను సంప్రదించి పార్టీ మారడం లేదు. రెండుసార్లు టికెట్‌ ఇప్పించాం. ఇంత నమ్మకద్రోహం చేస్తాడనుకోలేదు’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి శుక్రవారం తిరుపతిలో వ్యాఖ్యానించారు. లింగయ్య పార్టీ మారే విషయంలో మాజీ మంత్రి, కాంగ్రెస్‌  సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎలాంటి ప్రకటనా చేయలేదు. 

ఏం జరిగింది? 
కోమటిరెడ్డి సోదరులను పార్టీలోకి తీసుకోవద్దని, లింగయ్యను తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని టీఆర్‌ఎస్‌ జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు అధినేత కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం. లింగయ్యను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను మంత్రి జగదీశ్‌రెడ్డికి కేసీఆర్‌ అప్పజెప్పారని తెలుస్తోంది. లింగయ్య టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన సమయంలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో ఉన్న సంబంధాలను, మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌తో ఉన్న పరిచయాలను ముందుపెట్టి  జగదీశ్‌రెడ్డి పావులు కదిపారని అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement