‘టీడీపీ నాయకులకు మతి భ్రమించింది’ | Kapu Ramachandra Reddy Fires On TDP Leader Kalava Srinivasulu | Sakshi
Sakshi News home page

రాజకీయ లబ్ధి కోసమే కక్షలకు ఆజ్యం..

Sep 13 2019 4:15 PM | Updated on Sep 13 2019 5:06 PM

Kapu Ramachandra Reddy Fires On TDP Leader Kalava Srinivasulu - Sakshi

సాక్షి, అనంతపురం: రాజకీయ లబ్ధి కోసమే మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు గ్రామాల్లో కక్షలకు ఆజ్యం పోస్తున్నారని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటమి అనంతరం టీడీపీ నాయకులకు మతి భ్రమించిందన్నారు. ప్రభుత్వ పాలనను విమర్శించడమే ధ్యేయంగా పని పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకుల రౌడీయిజం రోజురోజుకు పెరుగుతుందని.. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు పేరు వింటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ శ్రీనివాసులు మాటలు నమ్మి.. ప్రజలు తమ జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. టీడీపీ కార్యకర్తలతో మాకు ఎలాంటి విబేధాలు లేవని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement